Tuesday, June 24, 2008

వరం

మా అమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఒక గ్రీటింగ్ కార్డు పైన వ్రాసి పంపిన కవిత

నే కోరిన వరములు నువు ఇస్తావని ఆశిస్తూ
నీ పుట్టిన రోజు నాడు నే పెట్టే దరఖాస్తు
" దేవుడు తను కరుణిస్తే ...
మనకు మరో జన్మ వరమిస్తే ...
మా అమ్మవి కదూ... నీవు
మా అమ్మగ పుట్టవూ?! "

- దర్భానాగ రంజన్

Tuesday, June 17, 2008

తనకోసం చూస్తూ ...

తన కోసం చూస్తూ
నే తలవాకిట నిలుచున్నా!

చిన్నప్పుడు ఆటలతో
పెద్దయాక పాటలతో
ముద్దులొలుకు మాటలతో
ముచ్చటైన ఆ చిన్నది ...
...తప్పక తను వస్తుందని ... తలవాకిట నిలుచున్నా!

చిన్ననాటి స్నేహానికి
మొన్నటితో స్వస్తి చెప్పి
నిన్న కన్ను గీటగానే
నన్ను కోరుకుంటూ ...
...తను నా కోసం వస్తుందని ... తలవాకిట నిలుచున్నా!!

చిన్న మాట అన్నానని
కన్నుల్లో నీరు నించి
చిన్నబుచ్చుకోని తాను
నన్ను వీడిపోగానే...
.... తను రాదని తెలిసి ... నే తలుపు మూసి పడుకున్నా!!!