ఈ మధ్య కాలంలో వచ్చే చాలా ప్రకటనలు, హిందీ నుండి తెలుగు లోకి అనువదింపబదినవే. అందులో చాలా ప్రకటనలు " ట్రూ ట్రాన్స్ లేషన్ " అనే ప్రక్రియకు బలి అయినవే. అందుచేత చాలా ప్రకటనలు తాము ప్రకటిద్దాం అనుకున్న భావం భాషలో పలకక ఇబ్బంది పడుతుంటాయి ... మనలను ఇబ్బంది పెడుతుంటాయి.
కానీ కొన్ని డైరెక్ట్ తెలుగు ప్రకటనలు కూడా తమ భావాన్ని భాషలో ప్రకటించలేక పోతున్నాయి అంటే ఒక తెలుగు వాడిగా చాలా బాధ కలుగుతుంది. అటువంటి కొన్ని (అ)ప్రకటనలు ఇక్కడ పొందు పరుస్తున్నాను ...
అంబికా దర్బార్ బత్తి
"అమ్మని మర్చిపోలేము ... అంబికానీ మర్చిపోలేము ..."
ఈ మాటని జాగ్రత్తగా గమనిస్తే స్ఫురించే అర్ధం ఏమిటంటే ... అమ్మని మరియు అంబికానీ మర్చిపోదాం అని ప్రయత్నించినా మర్చిపోలేము అని. నాకు తెలిసి వారి భావం ఈ విధంగా పలికించి ఉండాల్సింది ... "అమ్మనీ మర్చిపోము... అంబికానీ మర్చిపోము".
Saturday, July 17, 2010
Monday, February 15, 2010
జీతాలకు రెక్కలొచ్చాయి !
2001 లో ఐ . టి . సంక్షోభం వలన మాకు జీతాలు తగ్గాయి . ఒక సంవత్సరం తరువాత , మరల జీతాలు పెరిగాయి ... అనుకున్నదానికంటే బాగా పెరగడంతో ... ఆనందాన్ని తట్టుకోలేక అక్కకి కవిత కొట్టాను !
అక్కా మా జీతాలకు రెక్కలొచ్చాయి
ఎక్కువ మొత్తంలోనే చెక్కులోచ్చాయి !
ప్రాజెక్టులు పరంపరగ తోసుకొచ్చాయి
మంచి రోజులను మాకై మోసుకొచ్చాయి !!
చక్కబడ్డ జీతాలను చొక్కాలో కుక్కేందుకు
ఈ నెల నుండే మాకా హక్కులోచ్చాయి !
జీతం పెరిగిందంటూ ... చాకిరి పెరిగిందంతే
చేతలు కొత్తవే అయినా ... చేసే పని తీరంతే :-)
అక్కా మా జీతాలకు రెక్కలొచ్చాయి
ఎక్కువ మొత్తంలోనే చెక్కులోచ్చాయి !
ప్రాజెక్టులు పరంపరగ తోసుకొచ్చాయి
మంచి రోజులను మాకై మోసుకొచ్చాయి !!
చక్కబడ్డ జీతాలను చొక్కాలో కుక్కేందుకు
ఈ నెల నుండే మాకా హక్కులోచ్చాయి !
జీతం పెరిగిందంటూ ... చాకిరి పెరిగిందంతే
చేతలు కొత్తవే అయినా ... చేసే పని తీరంతే :-)
రాఖీ !!
రాఖీ పండగకి మా పెద్దక్క పోస్టులో రాఖీ పెట్టి పంపింది. నేను ఊరుకుంటానా ...?! జవాబు జాబులో ... రెండు వందల రూపాయలు పెట్టాను ... ఓ కవిత కొట్టాను ... ఆ కవితే ఇక్కడ పెట్టాను :
అక్కా నీ ఉత్తరం అరుదెంచింది
అందు బంధనం నా మదినలరించింది !
శ్రావణ పౌర్ణమి శోభలు కురిపించింది
తమ్ముడిపై నీదు ప్రేమ తలపించింది !!
అట్టముక్క మీద ఆర్టు చెక్కినట్టు గోచరించు
బంధనాన నీదు ప్రేమ కనిపించింది !
'బుజ్జీ' అని చేరదీసి ప్రేమ తోడ ఆదరించు
అక్కలుండటం లక్కీ అనిపించింది !!
అనుబంధపు సువాసనలు విరియిస్తున్న
బంధనాన్ని కరమున నే ధరియిస్తున్నా !
అర చతుర్ద్ధ శత రూకలు అందిస్తున్నా
ఆశీస్సున అక్షితలను ఆశిస్తున్నా !!
అక్కా నీ ఉత్తరం అరుదెంచింది
అందు బంధనం నా మదినలరించింది !
శ్రావణ పౌర్ణమి శోభలు కురిపించింది
తమ్ముడిపై నీదు ప్రేమ తలపించింది !!
అట్టముక్క మీద ఆర్టు చెక్కినట్టు గోచరించు
బంధనాన నీదు ప్రేమ కనిపించింది !
'బుజ్జీ' అని చేరదీసి ప్రేమ తోడ ఆదరించు
అక్కలుండటం లక్కీ అనిపించింది !!
అనుబంధపు సువాసనలు విరియిస్తున్న
బంధనాన్ని కరమున నే ధరియిస్తున్నా !
అర చతుర్ద్ధ శత రూకలు అందిస్తున్నా
ఆశీస్సున అక్షితలను ఆశిస్తున్నా !!
Monday, July 21, 2008
రేడియో సిటీ - సమాధానాలు
రేడియో సిటీ లో డౌట్ల దావూద్ చిలిపి ప్రశ్నలకు పంపిన సమాధానాలు :
ప్రశ్న :
ఆడవాళ్ళు ఆటో వాళ్ళని, షాపులలోవాళ్ళని 'భయ్యా' అని ఎందుకు అంటారు?
సమాధానం :
ఆటో వారైన గాని, అంగడి వారైన గాని,
అన్నకు ఫ్రెండ్ అయిన గాని, అత్తకు కొడుకైన గాని,
నచ్చితేనే సయ్యా ... మరి నచ్చకపోతే భయ్యా
ఆడవారి పిలుపులోన అంతరార్ధమిదేనయా!!!
ప్రశ్న :
ఫోటోగ్రాఫెర్ ఫోటో తీసేటప్పుడు 'స్మైల్ ప్లీజ్' అని ఎందుకు అంటాడు?
సమాధానం :
ఎందుకంటే ... 'బాబూ నవ్వితే ఇప్పుడే నేను ఫోటో తీసేటప్పుడే నవ్వు ...
నేను ఫోటో తీసిన తరువాత ... నువ్వా ఫోటో చూసిన తరువాత ...
నీకు నవ్వే అవకాశం ఉండదు ' అని దాని అర్థం.
ప్రశ్న :
మగవాళ్ళే ఎందుకు 'ఐ లవ్ యు' చెప్పాలి ?
సమాధానం :
ఇలా మగవాళ్ళే ఎందుకు 'ఐ లవ్ యు' చెప్పాలి అని భీష్మించుకు కూర్చునే మా తాత గారికి ఇప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ దొరకలేదు ... :-(
ప్రశ్న :
ఆడవాళ్ళు ఆటో వాళ్ళని, షాపులలోవాళ్ళని 'భయ్యా' అని ఎందుకు అంటారు?
సమాధానం :
ఆటో వారైన గాని, అంగడి వారైన గాని,
అన్నకు ఫ్రెండ్ అయిన గాని, అత్తకు కొడుకైన గాని,
నచ్చితేనే సయ్యా ... మరి నచ్చకపోతే భయ్యా
ఆడవారి పిలుపులోన అంతరార్ధమిదేనయా!!!
ప్రశ్న :
ఫోటోగ్రాఫెర్ ఫోటో తీసేటప్పుడు 'స్మైల్ ప్లీజ్' అని ఎందుకు అంటాడు?
సమాధానం :
ఎందుకంటే ... 'బాబూ నవ్వితే ఇప్పుడే నేను ఫోటో తీసేటప్పుడే నవ్వు ...
నేను ఫోటో తీసిన తరువాత ... నువ్వా ఫోటో చూసిన తరువాత ...
నీకు నవ్వే అవకాశం ఉండదు ' అని దాని అర్థం.
ప్రశ్న :
మగవాళ్ళే ఎందుకు 'ఐ లవ్ యు' చెప్పాలి ?
సమాధానం :
ఇలా మగవాళ్ళే ఎందుకు 'ఐ లవ్ యు' చెప్పాలి అని భీష్మించుకు కూర్చునే మా తాత గారికి ఇప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ దొరకలేదు ... :-(
Tuesday, June 24, 2008
వరం
మా అమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఒక గ్రీటింగ్ కార్డు పైన వ్రాసి పంపిన కవిత
నే కోరిన వరములు నువు ఇస్తావని ఆశిస్తూ
నీ పుట్టిన రోజు నాడు నే పెట్టే దరఖాస్తు
" దేవుడు తను కరుణిస్తే ...
మనకు మరో జన్మ వరమిస్తే ...
మా అమ్మవి కదూ... నీవు
మా అమ్మగ పుట్టవూ?! "
- దర్భానాగ రంజన్
నే కోరిన వరములు నువు ఇస్తావని ఆశిస్తూ
నీ పుట్టిన రోజు నాడు నే పెట్టే దరఖాస్తు
" దేవుడు తను కరుణిస్తే ...
మనకు మరో జన్మ వరమిస్తే ...
మా అమ్మవి కదూ... నీవు
మా అమ్మగ పుట్టవూ?! "
- దర్భానాగ రంజన్
Tuesday, June 17, 2008
తనకోసం చూస్తూ ...
తన కోసం చూస్తూ
నే తలవాకిట నిలుచున్నా!
చిన్నప్పుడు ఆటలతో
పెద్దయాక పాటలతో
ముద్దులొలుకు మాటలతో
ముచ్చటైన ఆ చిన్నది ...
...తప్పక తను వస్తుందని ... తలవాకిట నిలుచున్నా!
చిన్ననాటి స్నేహానికి
మొన్నటితో స్వస్తి చెప్పి
నిన్న కన్ను గీటగానే
నన్ను కోరుకుంటూ ...
...తను నా కోసం వస్తుందని ... తలవాకిట నిలుచున్నా!!
చిన్న మాట అన్నానని
కన్నుల్లో నీరు నించి
చిన్నబుచ్చుకోని తాను
నన్ను వీడిపోగానే...
.... తను రాదని తెలిసి ... నే తలుపు మూసి పడుకున్నా!!!
నే తలవాకిట నిలుచున్నా!
చిన్నప్పుడు ఆటలతో
పెద్దయాక పాటలతో
ముద్దులొలుకు మాటలతో
ముచ్చటైన ఆ చిన్నది ...
...తప్పక తను వస్తుందని ... తలవాకిట నిలుచున్నా!
చిన్ననాటి స్నేహానికి
మొన్నటితో స్వస్తి చెప్పి
నిన్న కన్ను గీటగానే
నన్ను కోరుకుంటూ ...
...తను నా కోసం వస్తుందని ... తలవాకిట నిలుచున్నా!!
చిన్న మాట అన్నానని
కన్నుల్లో నీరు నించి
చిన్నబుచ్చుకోని తాను
నన్ను వీడిపోగానే...
.... తను రాదని తెలిసి ... నే తలుపు మూసి పడుకున్నా!!!
Subscribe to:
Posts (Atom)
